అంతా నాన్న చలవే.. | - | Sakshi
Sakshi News home page

అంతా నాన్న చలవే..

Jun 15 2025 7:23 AM | Updated on Jun 15 2025 7:23 AM

అంతా

అంతా నాన్న చలవే..

సిరిసిల్లకల్చరల్‌: మా నాన్న మంచాల విఠల్‌. ఊళ్లో ఇప్పుడు చాలా మందికి తెలిసిన పేరిది. ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మే పని నాన్నది. పొద్దునెప్పుడో మేం నిద్ర లేవక ముందే వెళ్లి పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు. ఏడుగురు చెల్లెళ్ల బరువు బాధ్యతలతో పాటు మా ముగ్గురు అన్నదమ్ముల (తమ్ముళ్లు రాజేశ్‌, రవి) ఆలనాపాలనా నాన్నకు ఎంత కష్టమో తల్చుకుంటే భయం కలిగేది. అయినా ఆయన పడే కష్టం పని చేసే నిష్ట మమ్మల్ని బాధ్యతాయుతంగా నడిపించింది. కడుపులో కష్టం దాచుకుని మమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని పెంచారు. ఆ కష్టం మరో తరంలో రాకూడదనే బలమైన భావనను నింపుకుని నాతో పాటు తమ్ముళ్లిద్దరూ శ్రమించి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత అల్ఫోర్స్‌లో ఇంటర్‌, మద్రాస్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ 2011లో పూర్తి చేశా. నాలుగేళ్ల పాటు డేటా పవర్‌లో ఉద్యోగం చేసిన. సొసైటీ సర్వీస్‌పై ఇష్టంతో 2014లో యుపీఎస్సీ పరీక్ష రాశాను. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ జాతీయ స్థాయిలో 160 ర్యాంకుతో సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు సర్వే ఇండియా, హైదరాబాద్‌లో సూపరింటెండెంట్‌గా స్థిరపడ్డాను. తమ్ముళ్లిద్దరూ కూడా సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో స్థిరపడ్డారు. మా ఈ స్థితి, పురోగతి అంతా నాన్న చలవే. – మంచాల సంతోష్‌, ఐఈఎస్‌, సూపరింటెండెంట్‌ సర్వేయర్‌

మమ్మల్నే ఆస్తిగా భావించారు

సిరిసిల్లలో ప్రైవేట్‌ స్కూల్‌ మాస్టర్‌ మా నాన్న. మేమిద్దరం అమ్మానాన్నకు రెండు కళ్లు. చేస్తున్న ఉద్యోగం కుటుంబానికి సరిపోదని తెలిసినా మంచి చదువు తప్ప మరేదీ స్థిరం కాదని గుర్తించారు. అంతే .. కన్న తల్లి లాంటి ఊరునీ, అయిన వాళ్లందరికీ దూరంగా కేవలం మాకు మంచి చదువు చెప్పించేందుకు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడ కూడా ప్రైవేట్‌ స్కూళ్లో అమ్మానాన్నా ఇద్దరూ టీచర్లుగా పని చేస్తూ నిద్రాహారాలు మాని మమ్మల్ని చదివించారు. వాళ్ల అంచనాలను అందుకునే దిశగా మేమూ అదే రీతిలో కష్టపడ్డాం. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో నేను, హైదరాబాద్‌ ఐఐటీలో తమ్ముడు ఇంజినీరింగ్‌ పూర్తి చేశాం. కొన్నాళ్లు టాటా స్టీల్స్‌లో ఉద్యోగం చేసినా మరింత పురోగమించాలనే ఆకాంక్షతో యూపీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నా. తమ్ముడు ఆదర్శ్‌సాయి గూగుల్‌, బెంగళూర్‌ బ్రాంచ్‌లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మా ఈ జీవితం అమ్మా నాన్న ప్రసాదించిన వరంగా భావిస్తాం. ఇకపై వాళ్లకు కష్టం అవసరంలేని జీవితం ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇదంతా అమ్మానాన్న వల్లే.

– ఆడెపు సాయి ప్రీతమ్‌, ఆదర్శ్‌సాయి, ఐఐటీయన్స్‌

అంతా నాన్న చలవే..
1
1/1

అంతా నాన్న చలవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement