కష్టపడి.. పిల్లలను తీర్చిదిద్ది.. | - | Sakshi
Sakshi News home page

కష్టపడి.. పిల్లలను తీర్చిదిద్ది..

Jun 15 2025 7:23 AM | Updated on Jun 15 2025 7:23 AM

కష్టపడి.. పిల్లలను తీర్చిదిద్ది..

కష్టపడి.. పిల్లలను తీర్చిదిద్ది..

ఇల్లంతకుంట(మానకొండూర్‌): పిల్లలను ప్రయోజకులను చేసేందుకు దాదాపు ఇరవై ఏళ్లుగా కష్టపడుతున్నాడు ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన గొట్టపర్తి యాదగిరిగౌడ్‌. చిన్నవయస్సులో తండ్రి చనిపోగా కుటుంబ బాధ్యతలు చేపట్టారు. ఇతడి భార్య లక్ష్మి గృహిణి. వీరికి రాకేశ్‌, రవళి, రచన సంతానం. తనకున్న కొద్దిపాటి వ్యవసాయం, గ్రామంలో మోటారు వైండింగ్‌ పనులు చేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించాడు. పెద్దమ్మాయి రవళి ఎంకామ్‌ చదవగా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో వివాహమైంది. రెండో అమ్మాయి రచన ఎంఎస్సీ బీఈడీ చదువుతోంది. కొడుకు రాకేశ్‌ గ్రూప్‌–4లో ఎంపికై రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రొబిషనరీ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ, ఇటీవలే ప్రకటించిన గ్రూప్‌–2 ఫలితాల్లో స్టేట్‌లో 24వ ర్యాంకు సాధించాడు. ఇలా కష్టపడి తన పిల్లలను తీర్చిదిద్దాడు యాదగిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement