
ఆడపిల్లలని ఇబ్బంది పడకుండా..
జగిత్యాల: ఇంటిపెద్దకు చదువంటే ప్రాణం. కానీ చదువుకోలేదు. ముగ్గురు ఆడపిల్లల్ని చదివించి ఉన్నతస్థాయిలో నిలిపాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కటికెవాడకు చెందిన సట్ట రవీందర్–జమున దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నతనం నుంచే వారిని చదివించాలన్న ఉద్దేశంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వారిని ఉన్నతస్థాయిలో నిలబెట్టారు. రవీందర్ డ్రైక్లీనింగ్ షాపు నడుపుకుంటుండగా అతడి భార్య గృహిణి. పెద్ద అమ్మాయి అలేఖ్య ఎంఏ తెలుగు చదివి జాబ్ సెర్చ్‌లో ఉంది. చిన్న కూతురు అఖిల హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతోంది. మరో కూతురు అమూల్య డాక్టర్ పూర్తి చేయగా, ఇటీవలే జూనియర్ డాక్టర్‌గా కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు అయినా ఆ తండ్రి ఇబ్బంది పడకుండా వారిని చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.