టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు

Jun 30 2024 2:42 AM | Updated on Jun 30 2024 2:42 AM

టీబీజ

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు

గోదావరిఖని: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) పూర్తిస్థాయి కేంద్ర కమిటీని ఆ యూనియన్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ వెల్లడించారు. శనివారం స్థానిక యూనియన్‌ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమిటీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా మాదాసు రాంమూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నూనె కొమురయ్య, ఉపాధ్యక్షులుగా బడికెల సంపత్‌కుమార్‌, దరావత్‌ మంగీలాల్‌, జంగిలి రవీందర్‌, నల్లవెల్లి సదానందం, కె.వీరభద్రం, చెర్కు ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. అదేవిధంగా అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి లావడియా వెంకటేశ్‌, ఉప ప్రధాన కార్యదర్శులు ఎండీ జాహిద్‌పాషా, బండి రమేశ్‌, రాజశేఖర్‌, ఎస్‌.రంగనాథ్‌, పింగిలి సంపత్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా చెల్పూరి సతీశ్‌, పానగంటి సత్తయ్య, బేతి చంద్రయ్య, సిద్దంశెట్టి సాజన్‌, దాసరి శ్రీనివాస్‌, కిరణ్‌కుమర్‌, అవినాష్‌, ఇ.ప్రవీణ్‌కుమార్‌తోపాటు 81మంది పేర్లతో కూడిన జాబితాను వెల్లడించారు.

11 మంది డివిజన్‌ ఉపాధ్యక్షులు వీరే

టీజీబీకేఎస్‌ 11 డివిజన్లకు ఉపాధ్యక్షుల పేర్లను నాయకులు ప్రకటించారు. బెల్లంపల్లి ఉపాధ్యక్షుడిగా మల్రాజు శ్రీనివాసరావు, మందమర్రి ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి సంపత్‌, శ్రీరాంపూర్‌ ఉపాధ్యక్షుడిగా పెట్ట లక్ష్మణ్‌, ఆర్జీ–1 ఉపాధ్యక్షుడిగా వడ్డేపల్లి శంకర్‌, ఆర్జీ–2 ఉపాధ్యక్షుడిగా ఐలి శ్రీనివాస్‌, ఆర్జీ–3 ఉపాధ్యక్షుడిగా నాగెల్లి సాంబయ్య, భూపాలపల్లి ఉపాధ్యక్షుడిగా బడితల సమ్మయ్య, మణుగూరు ఉపాధ్యక్షుడిగా నాగెల్లి వెంకటేశ్‌, కొత్తగూడెం ఉపాధ్యక్షుడిగా గడప రాజయ్య, కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడిగా తుమ్మ శ్రీనివాసరావు, ఇల్లెందు ఉపాధ్యక్షుడిగా జాఫర్‌ హుస్సేనును నియమించినట్లు యూనియన్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వెల్లడించారు.

81 మందితో పూర్తిస్థాయి కార్యవర్గం

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు 1
1/3

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు 2
2/3

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు 3
3/3

టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement