చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

Mar 4 2024 12:35 AM | Updated on Mar 4 2024 9:33 AM

- - Sakshi

పిట్టల సురేశ్‌(ఫైల్‌)

కరీంనగర్: చేపల వేట కు వెళ్లి ఓ యువకుడు కాలువలోపడి మృతి చెందాడు. రామగుండం కార్పొరేషన్‌లోని ఐదో డివిజన్‌ మల్కాపూర్‌ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన పిట్టల సురేశ్‌(30) ఆదివారం సమీపంలోని ఎన్టీపీసీ వరద కాలువలో చేపల వేటకు వెళ్లాడు.

ప్రమాదవాశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి తల్లి పిట్టల బాయమ్మ తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు గాలింపు చేపట్టి సురేశ్‌ కాలువలో పడిమృతి చెందాడని గుర్తించారు. ఈమేరకు బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి చదవండి: జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!

Advertisement
 
Advertisement
Advertisement