గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలి

గంగాధర: గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని సోమవారం గంగాధర మండలం నారాయణపూర్‌, ఇస్తార్‌పల్లి గ్రామస్తులు కరీంనగర్‌–జగిత్యాల ప్రధాన రహదారి మధురానగర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో చెరువు కట్ట కింద గ్రామంలోని కొన్ని ఇళ్లను మాత్రమే ముంపు కింద స్వీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితం ముంపుకింద గుర్తించిన దాదాపు 30 ఇళ్ల ను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను గ్రా మస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రా మస్తులు, ముంపుకింద గుర్తించిన 30 కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సో మవారం మధురానగర్‌ చౌరస్తాలో బైఠాయించారు. తాను గెలిచిన వందరోజుల్లోనే నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటింపచేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం త మ సమస్యను పట్టించుకోవాలన్నారు. రిజర్వాయర్‌ పనులు పూర్తయితే తమ బతుకులు ఆగమ్యగోచరమేనని ఆవేదన వ్య క్తం చేశారు. ఎ లాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. మధురానగర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే ప్రజాకార్యాలయం వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు బందోబస్తు నిర్వహించారు.

భగత్‌నగర్‌ దోపిడీ కేసులో పురోగతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ నగరంలోని భగత్‌నగర్‌లో జరిగిన దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి లభించిన వివరాలతో కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలు స్తోంది. అలాగే, దోపిడీకి గురైన సొత్తులో కొంత భాగాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ, తది తర అంశాలను ఇంకా వెల్లడించలేదు. మిగిలిన సొత్తు స్వాధీనం, ఇతర నిందితుల గుర్తింపు కో సం ప్రత్యేక బృందాలు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మీరట్‌లో విచారణ పూర్తయిన అనంతరం అదుపులోకి తీసుకున్న నిందితుడిని కరీంనగర్‌కు తరలించి కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్వోబీ పనులు వేగవంతం

కరీంనగర్‌: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మాణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం సేతు బంధు పథకం కింద ఈ ప్రాజెక్టు కోసం రూ.154 కోట్లు మంజూరు చేసినా, స్థానికంగా భూసేకరణ, సర్వీస్‌ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో ఆలస్యం జరిగింది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మూడునెలల క్రితమే సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి ప్రత్యేక నిధులు కేటాయించారు. అయితే, ప్రస్తుత వర్షాకాలంలో రోడ్డు పరిస్థితి వల్ల ప్రయాణానికి మరింత ఆటంకం కలుగుతుందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి పనుల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చివరివరకు ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement