కరీంనగర్ అర్బన్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు లక సూచనలు చేశారు. కందులు, పెసలు, నూనెగింజల పంటలు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెద్ద ఎత్తున చేపట్టేలా రైతులను ప్రోహించాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని, ప్రతీ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలని సూచించారు. జిల్లా వ్య వసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
గుడిసెల వివరాలు పక్కాగా సేకరించండి
ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీడం గంగారాం, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పూరిగుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలు సేకరించాలని ఆదేశించారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి పథకం విజయవంతం కావడానికి కృషి చేయాలని సూచించారు.


