పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలు.. తల్లిని దూషించాడని..

Feb 10 2024 1:46 AM | Updated on Feb 10 2024 10:47 AM

- - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రవీణ్‌కుమార్‌

కరీంనగర్: పాత కక్షలతో పాటు తన తల్లిని దూషిస్తున్నాడన్న విషయాన్ని మనసులో పెట్టుకుని వాసాల రఘు గురువారం సాయంత్రం అనుమల్ల వెంకటరమణ(54)పై దాడి చేసి కత్తితో పొడిచి చంపాడని కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతంలో వాసాల రఘుపై అనుమల్ల వెంకటరమణ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టించాడని కక్ష కట్టినట్లు తెలిపారు.

దీంతో పాటు వెంకటరమణ కొద్దిరోజులుగా రఘు కుటుంబంతో పాటు అతడి తల్లి విషయంలో తప్పుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య కక్షలు పెరిగి హత్యకు దారితీశాయి. నిందితుడు రఘును అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు టూవీలర్‌ మోటార్‌సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇవి చదవండి: అనుమతిస్తారా.. చావమంటారా?

Advertisement
 
Advertisement
Advertisement