ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి? | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?

Nov 9 2023 12:40 AM | Updated on Nov 9 2023 8:47 AM

- - Sakshi

నితిన్‌ (ఫైల్‌)

సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్‌ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్‌ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్‌ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..

Advertisement
 
Advertisement
Advertisement