మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

కామారెడ్డి రూరల్‌: మహిళా సంఘాల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్‌ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి ఏపీఎం, సీసీలు, వీవోల శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం చేపడుతున్న ఎంటర్‌ప్రైజెస్‌ను విస్తరించడానికి అవసరమైన వ్యక్తిగత రుణాల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి బ్యాంకులకు అందించాలని సూచించారు. మండల సమాఖ్యల పనితీరు, ఆర్థిక అంశాలపై చర్చించారు. సీ్త్రనిధి, బ్యాంక్‌ లింకేజీ రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. డీపీఎంలు, శ్రీనివాస్‌, రాజయ్య, సురేశ్‌ కుమార్‌, శ్రీనిధి ఆర్‌ఎం కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement