సాగు కష్టాలు.. తెగుళ్ల బెడద | - | Sakshi
Sakshi News home page

సాగు కష్టాలు.. తెగుళ్ల బెడద

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

నాగిరెడ్డిపేట: వానాకాలంలో వరి సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు సాగునీటి కొరత.. మరోవైపు చీడపీడల బెడద అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్టుబడులు పెట్టి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు కీలక దశలో ఎదురవుతున్న సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వరిపంటను ఆశిస్తున్న సుడిదోమ, కంకినల్లి నివారణ కోసం రైతులు చేపట్టాల్సిన చర్యలపై నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద శివారులో ఉన్న తెలంగాణ రైతువిజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ రేవంత్‌ నాథన్‌ సలహాలు, సూచనలు ఆయన మాటల్లో..

వరి సాగులో నష్టపరిచే సుడిదోమ

దోమలు, వాటి పిల్లపురుగులు వరిపిలకల మొదళ్లలో చేరి రసాన్ని పీల్చుతాయి. దీనివల్ల ఆకులు పసుపురంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. పొలంలో అక్కడక్కడా వరిపైరు సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని ‘సుడి తెగులు’ అంటారు. వరిపంటలో సైపర్‌మెత్రిన్‌, డెల్టామెత్రిన్‌, లాంబ్డా–సైహలోత్రిన్‌ వంటి సింథటిక్‌ పైరెథ్రాయిడ్స్‌ వాడకం మొక్కల్లో ఫైటోటోనిక్‌ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఆకులు ముదురు పచ్చరంగులోకి మారడం, కాండం పెరగడం జరుగుతుంది.

నివారణా పద్ధతులు..

పొలంలో దోమ ఉధృతిని తగ్గించడానికి పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పుతో బాటలు (కాలిబాటలు) తీయాలి. దీనివల్ల గాలి, వెలుతురు ధారాళంగా తగిలి దోమల వృద్ధి తగ్గుతుంది. పొలంలో నీరు ఎప్పుడూ నిల్వఉండకుండా చూసుకోవాలి.

నత్రజని ఎరువుల నియంత్రణ: నత్రజని (యూరియా) ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మితిమీరి వాడితే దోమల ఉధృతి పెరుగుతుంది.

రసాయన నివారణ చర్యలు: పొలంలో దోమల సంఖ్య గమనించినప్పుడు (మొదలుకు 5–10 దోమలు ఉన్నప్పుడు) కింది కీటక నాశనులను పిలకల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.

పైమెట్రోజిన్‌ 50శాతం డబ్ల్యూజీ: ఎకరానికి 120 గ్రాములు.

డైనోటెఫ్యురాన్‌ 20శాతం ఎస్‌జీ: ఎకరానికి 80గ్రాశ్రీశ్రీ

ట్రైఫ్లూమెజోపైరిమ్‌ 10శాతం ఎస్సీ: ఎకరానికి 94 మిల్లీలీటర్లు.

కంకినల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కంకి నల్లి ఆశించే అవకాశం ఉంది.

కంకి నల్లి ఆశించినట్లు గుర్తించే ముఖ్య లక్షణాలు

ఆకు తొడుగులు రంగు మారడం: వరి పొట్టకు లోపల చేరి రసాన్ని పీల్చడం వల్ల వాటిపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి

తాలుగింజలు: వెన్ను లేదా కంకి బయటకు వచ్చే దశలో ఇది ఆశిస్తే, గింజలు పాలు పోసుకోక ఎండిపోయి తెల్లటి తాళుగింజలుగా మారుతాయి.

రసాన్ని పీల్చడం: పాలుపోసుకునే దశలో గింజలు చాలా మెత్తగా, పచ్చగా ఉంటాయి. కంకినల్లి లోపల ఉన్న పాలను/రసాన్ని పీల్చేస్తుంది. ఇలా పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చగా మారుతుంది. దీనిని గమనిస్తే నివారణకు 1 మి.లీ. స్పైరోమెసిఫెన్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరిసాగులో అన్నదాతలకు

తప్పని ఇబ్బందులు

సాగునీటి కొరతతో పాటు

చీడపీడల దాడి

దిగుబడిపై ప్రభావం పడుతుందనే

ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement