ఘనంగా గంగమ్మ ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గంగమ్మ ఆలయ వార్షికోత్సవం

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

బాన్సువాడ రూలర్‌: మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం గంగమ్మ ఆలయ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. సర్పంచ్‌ సంధ్యారాణి రాజ్‌కుమార్‌, నాయకులు మాలెపు నారాయణరెడ్డి, అక్కంగారి రమేశ్‌, సాయిలుబోయి, పల్కిసాయిలు, అక్కంగారి సాయిలు, గంగపుత్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement