● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● మహిళలతో కలిసి
బతుకమ్మ ఆడిన కలెక్టర్
కామారెడ్డి టౌన్: తెలంగాణ విశిష్టత, సంస్కృతిని భావితరాలను అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను జిల్లావ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జిల్లా యువజన, క్రీడల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడి మాట్లాడారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ విక్టర్, శిక్షణ కలెక్టర్ రవితేజ, డీపీవో మురళి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, దేవేందర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర గౌడ్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


