బాన్సువాడ : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి కారణ్య నియామకం కల్పించాలని పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. ఈమేరకు బుధవారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రంజిత్రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో బాన్సువాడకు చెందిన కానిస్టేబుల్ రఘు అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈవిషయంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తానని పోచారం అన్నారు. కానిస్టేబుళ్లు శంకర్, వినీత, ప్రణీత, సతీష్ తదితరులు ఉన్నారు.


