నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తనక్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం సుమారు రూ.48 లక్షల నిధులు కేటాయించింది. విత్తనక్షేత్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవల ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా.. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) ద్వారా కేంద్రప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విత్తనక్షేత్రంలో 10 కి.మీ. మేర ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.15 లక్షలు, 10 బోరుబావుల తవ్వకం కోసం రూ. 15 లక్షలు, 7 సోలార్ ప్యానల్స్‌తో కూడిన బోరుమోటార్లకు రూ.18 లక్షలు వినియోగించనున్నారు. ప్రస్తుతానికి క్షేత్రంలో 4 బోరుబావులను తవ్వించారు. మిగతా పనులు త్వరలో చేపట్టనున్నారు. బోరుబావుల తవ్వకం పూర్తయి సోలార్ ప్యానల్స్‌తో కూడిన బోరుమోటార్లను బిగిస్తే పంటల సాగుకు ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు.
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రాన్ని మంగళవారం జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి మండల అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యాన క్షేత్రంలోని 40 ఎకరాల భూమిలో ఆయిల్‌పాం సాగు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. పరిశీలన నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. ఆమె వెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐ అజయ్ తదితరులున్నారు.


