● పొరపాట్లకు తావివ్వొద్దు
● రైటర్లతో ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి టౌన్: ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి అంశాన్ని స్పష్టంగా, పకడ్బందీగా నమోదు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర రైటర్లకు సూచించారు. ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు ఇవ్వొద్దన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం రైటర్లకు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను పాటించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, పలువురు పోలీస్ అధికారులు, ఆయా స్టేషన్ల రైటర్లు పాల్గొన్నారు.


