నల్లబడుతున్న తెల్లబంగారం | - | Sakshi
Sakshi News home page

నల్లబడుతున్న తెల్లబంగారం

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

నల్లబడుతున్న తెల్లబంగారం

రూ.60వేలు ఖర్చు పెట్టిన..

అప్పులు ఎట్లా తీర్చాలో..

● వర్షాభావ పరిస్థితులతో

ఎండిపోతున్న పత్తి

● ఆందోళనలో అన్నదాతలు

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): అన్నదాత కష్టపడి పండించిన పత్తిపంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి పగబట్టింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూమిలో తేమ తగ్గి, కాయ తొడిగే కీలక దశలో పత్తి మొక్కలు ఎండకు మాడిపోతున్నాయి. దీనివల్ల పంట దిగుబడి భారీగా తగ్గి, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కూడా లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 32వేల ఎకరాల్లో..

జుక్కల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 32,250 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. మండలాల వారీగా జుక్కల్‌ మండలంలో 15,038 ఎకరాలు, మద్నూర్‌ మండలంలో 6,208 ఎకరాలు, పెద్దకొడప్‌గల్‌ మండలంలో 5,732 ఎకరాలు, పిట్లం మండలంలో 3,562 ఎకరాలు, బిచ్కుంద మండలంలో 1,310 ఎకరాలు, డోంగ్లి మండలంలో 221 ఎకరాలు, నిజాంసాగర్‌ మండలంలో 155 ఎకరాల్లో పంట సాగవుతోంది. ఎన్నో ఆశలతో రైతులు అప్పులు చేసి మరీ విత్తనాలు నాటారు. అయితే, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. మండలాల్లోని భూములు ఇప్పడు నీటి జాడ లేక నెర్రెలు బారుతున్నాయి. మొక్కలు ఎదగాల్సిన సమయంలో వర్షం లేక, కాయ దశలోనే వాడిపోతున్నాయి. దీంతో తాము తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఈసారి పత్తి పంటకు మంచి ధర పలుకుతుందని ఆ శించి, రెండెకరాల్లో పంట సా గు చేశా. విత్తనాలు, ఎరువు లు, కూలీల ఖర్చులకింద ఇ ప్పటివరకు రూ. 60 వేలు ఖ ర్చయ్యాయి. కాయ తొడిగే సమయంలో వర్షాలు పడక మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. చేతికి వ చ్చే పంట కళ్ల ముందే వాడిపోతుంటే ఏం చేయాలో తోచడం లేదు. – బోడి పెంటయ్య, రైతు, పెద్ద కొడప్‌గల్‌

వర్షాలు లేక పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో బ్యాంకు వాళ్లుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. అధికారులు వచ్చి మా పంటలను పరిశీలించి నష్టపరిహరం అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.

– పెరడి విఠల్‌, రైతు, పెద్దకొడప్‌గల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement