రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ప్రతిభావంతులకు ‘ఇస్రో’ అవకాశం ప్రపంచస్థాయి చెస్‌ పోటీల్లో రాణించాలి

కామారెడ్డి అర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్‌–17 బాల బాలికల ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీ విజేతలు సిద్దిపేటలో 11, 12, 13 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆదివారం బయలుదేరి వెళ్లినట్టు జిల్లా కార్యదర్శి ఈ.శ్రీధర్‌ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు వీడ్కొలు తెలిపిన వారిలో మాజీ కార్యదర్శి హీరాలాల్‌, జట్టు కోచ్‌ గోమతి, పీడీ స్వప్న ఉన్నారు. రాష్ట్రస్థాయిలోనూ విజేతలుగా నిలిచి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న బాలికలకు ‘ఇస్రో ఎక్స్‌ప్లోరర్‌ విజిట్‌’లో భాగంగా ఇస్రోను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో మల్లికార్జున్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల తర్వాత ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి, మెరిట్‌ సాధించిన 50 మంది విద్యార్థినులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సైతం 50 మంది విద్యార్థినులను ఇస్రో, విజయవాడ సైన్స్‌ సెంటర్‌ టూర్‌కు తీసుకెళ్లగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారని పేర్కొన్నారు. హెచ్‌ఎంలు విద్యార్థినులకు ఈ సమాచారం అందించి పరీక్షకు సిద్ధం చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధి రాంరెడ్డి 9697982888 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

● జిల్లా యువజన, క్రీడల అధికారి

రంగ వెంకటేశ్వర్‌గౌడ్‌

కామారెడ్డి టౌన్‌ : జిల్లా విద్యార్థులు చదరంగం పోటీల్లో ప్రపంచస్థాయిలో రాణించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్‌ హైస్కూల్‌లో గజ్వేల్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదరంగం వంటి క్రీడలు విద్యార్థుల్లోని ఆలోచనా సరళిని పెంచి, మేధాశక్తిని వెలికితీయడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 60 మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విద్యార్థులు డి.ధనుష్‌, వై.హరి ఓం, ఎస్‌.మనితేజ, ఏ.అన్వేష్‌, ఎస్‌.మణికంఠ, ఎస్‌.కె.మహమ్మద్‌ అబేద్‌, కె.రిషికేశ్‌, టి.శ్రేయస్‌, ఎల్‌.లాస్య, పి.నవనీత్‌ రెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌, ఎస్పీఆర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ కొమిరెడ్డి మారుతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement