పాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత కేసీఆర్‌దే | - | Sakshi
Sakshi News home page

పాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత కేసీఆర్‌దే

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

● మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

● ఘనంగా జిల్లా పదేళ్ల

ఆవిర్భావ వేడుకలు

కామారెడ్డి టౌన్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రభుత్వ మాజీ విప్‌, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద దశాబ్ది ఉత్సవాల సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆ తర్వాత పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ సేవలు, కార్యాలయాలు ప్రజలకు చేరువ కావడంలో కేసీఆర్‌ పాత్ర కీలకమన్నారు. కామారెడ్డి జిల్లా ఉన్నంతకాలం ఇక్కడి చరిత్రలో కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. జిల్లాలు ఏర్పడటం, ప్రజలకు పరిపాలన సులభతరం కావడంతో పట్టణాలు, పల్లెలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే అన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంత్‌రావు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు కుంబాల రవి యాదవ్‌, పట్టణ యూత్‌ అధ్యక్షుడు చెలిమల భానుప్రసాద్‌, కౌన్సిలర్లు మామిండ్ల లక్ష్మణ్‌, గరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement