కామారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లోని పలు కాలనీలు, ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించారు. అంతకుముందు అమ్మవారిని ఊరేగింపుగా మండపాలకు తరలించారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మండపాలలో పలువురు భక్తులు భవానీ మాలాధారణ దీక్షను చేపట్టారు. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రాత్రి వేళలో ప్రత్యేకంగా దాండియా ఆటలు ఆడనున్నారు.
ఘనంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
మండపాల్లో కొలువుదీరిన
అమ్మవారు
వైభవోపేతంగా పూజలు


