బాన్సువాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద బతుకమ్మను తయారు చేయాలనే సంకల్పంతో బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీ యువకులు నడుం బిగించారు. సొంత ఖర్చులతో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీం యోధ యువజన సంఘం ఆధ్వర్యంలో 44 ఫీట్ల బతుకమ్మను తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 40 ఫీట్ల ఎత్తు బతుకమ్మను తయారు చేసి సంబరాలు నిర్వహించారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటి రూపమైన హింగ్లాజ్ దేవి అమ్మవారిని ప్రతిష్టిస్తున్నారు. పాకిస్థాన్ దేశంలో ఉన్న హింగ్లాజ్ దేవి శక్తిపీఠం రూపంతో విగ్రహాన్ని తెప్పిస్తున్నారు.
మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ. వివిధ రకాల పూలతో 44 ఫీట్ల ఎత్తు బతుకమ్మను తయారు చేసి భక్తులు దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 18 శక్తి పీఠాల్లో మొదటి రూపమైన హింగ్లాజ్ దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.
– తరుణ్, టీం యోధ సభ్యుడు, బాన్సువాడ
పెద్ద బతుకమ్మను
తయారుచేసిన యువకులు
మొట్టమొదటిసారిగా బాన్సువాడలో
హింగ్లాజ్ దేవి విగ్రహం ఏర్పాటు


