బైక్‌, ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌, ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

● మరొకరి పరిస్థితి విషమం

కమ్మర్‌పల్లి: బైక్‌, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్‌పల్లి మండలం అమీర్‌నగర్‌ గ్రామానికి చెందిన వర్ణం నర్సయ్య(35), తన తమ్ముడు రాజేందర్‌తో కలిసి బైక్‌పై ఆదివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు వెళ్లారు. వీరు తిరిగి వస్తుండగా అమీర్‌నగర్‌ పరిధిలోని బిలియానాయక్‌ తండా, కేసీఆర్‌ తండాల మధ్య రాంగ్‌ రూట్‌లో వస్తున్న బస్సు వీరిని ఢీకొన్నది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మెట్‌పల్లి ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు నర్సయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజేందర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలం మెట్‌పల్లి పరిధిలోకి రావడంతో మెట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement