బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీలో 1000 కుటుంబాలు నివాసముంటున్నాయి. కాలనీలో ఫస్ట్ రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఉంది. ఈ గుంత వద్ద కనీసం ప్రమాదం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి వేళల్లో కాలనీకి వాహనాలపై వచ్చే కాలనీ వాసులు ఈ గుంతతో ఇబ్బందులు పడుతున్నారు. చాల సార్లు బైక్‌లు గుంతను తప్పించబోయి ప్రమాదాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయి. ఇదే రోడ్డు మధ్యలో ఇనుప సలాకలు పైకి లేచి ఉన్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ – వర్ని మధ్య అటవీ మార్గంలో కోతుల బెడద ఎక్కువైంది. రోడ్డు మొత్తం కోతులు గుంపులుగా తిరుగుతుండటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఆహారం కోసం వాహనాలపైకి దూకడం, వెంబడించడం చేస్తున్నాయి. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


