వర్ని: మహిళలకు బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనదని అందరూ కలిసికట్టుగా ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందూరు మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రశాంతమైన వాతావరణంలో పండగను జరుపుకోవాలని, నిమజ్జనం సమయంలో ప్రమాదాలు జరగకుండా చెరువుల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్ని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, చందూర్ మాజీ సర్పంచ్ సాయ రెడ్డి, రామచందర్, సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.


