తస్మాత్‌ జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త!

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

సమాచారం ఇవ్వాలి

● తాళం వేసిన ఇళ్లే దొంగల టార్గెట్‌

● ముందస్తు జాగ్రత్తలతో చోరీలకు చెక్‌

● అప్రమత్తంగా ఉండాలని

పోలీసుల సూచన

పండుగకు

ఊరెళ్తున్నారా..

డిచ్‌పల్లి: పండుగల సందడి మొదలవడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల రాకపోకలు తగ్గిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే అదునుగా భావించే దొంగలు ఖాళీ ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఇళ్లను వదిలి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు పటిష్టంగా మూసివేయాలి. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలను బహిరంగంగా ఉంచకూడదు. ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

స్థానిక పోలీసులకు సమాచారం

సొంతూళ్లకు లేదా విహారయాత్రలకు వెళ్లే వారు తమ ప్రయాణ వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయడం మంచిది. ఇంటి చిరునామా, సంప్రదింపు ఫోన్‌ నంబర్‌ అందుబాటులో ఉంచడం ద్వారా అవసరమైన సమయంలో పోలీసులు స్పందించే అవకాశం ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

సీసీ కెమెరాలతో భద్రత

ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వాటిని మొబైల్‌ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవడం దా ్వరా ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు గమని ంచవచ్చు. రాత్రి సమయాల్లో ఇంటి పరిసరాల్లో తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో వాచ్‌మెన్లు అపరిచిత వ్యక్తుల వి వరాలను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.

వాహనాల విషయంలోనూ..

ఇళ్ల ముందు లేదా బయట పార్‌్‌క చేసే బైక్‌లకు వీల్‌ లాక్‌ చేయాలి. సాధ్యమైనంత వరకు వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలిపి ఉంచాలి. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు గ్యాస్‌, విద్యుత్‌ వంటి అంశాలను కూడా పరిశీలించారు.

అనుమానం వస్తే 112కు ఫోన్‌ చేయాలి

పండుగలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు ఇంటి భద్రతను విస్మరించకూడదు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. చోరీ ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు సమాచారం అందించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరిస్తే చోరీలను నివారించే అవకాశం ఉంటుంది.

బతుకమ్మ, దసరా పండుగలకు ఊళ్లకు వెళ్లే వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించాలి. దీంతో వారి ఇళ్లు, కాలనీల్లో గస్తీ నిర్వహించడంతో పాటు రాత్రి సమయంలో నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. పోలీసులతో పాటు చుట్టుపక్కల ఇళ్ల వారికి, కాలనీ పెద్దలకు సమాచారం ఇచ్చి వెళ్తే చోరీలు జరగకుండా నివారించవచ్చు.

– కే వినోద్‌, సీఐ డిచ్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement