ఆలోచించండి.. ఆవిష్కరించండి.. | - | Sakshi
Sakshi News home page

ఆలోచించండి.. ఆవిష్కరించండి..

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

విద్యార్థులను ప్రోత్సహించాలి

కామారెడ్డి టౌన్‌: పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వినూత్న ఆవిష్కరణలకు వేదిక కల్పించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సరికొత్త పోటీలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ’సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ’సేవా ఫస్ట్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌–2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలకు విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం.

ఐదు అంశాల్లో పోటీలు..

విద్యార్థులు తమ ప్రాజెక్టులు, ఆలోచనలను ప్రదర్శించేందుకు ఐదు విభాగాలను నిర్దేశించారు. సమృద్ధ్‌ అన్నదాత–సమృద్ధ్‌ భారత్‌, స్వస్థ్‌ సమావేశ్‌ భారత్‌, శిక్షిత్‌–కౌశల్‌ భారత్‌, సురక్షిత్‌ భారత్‌, స్వచ్ఛ్‌–సస్టెయినబుల్‌ భారత్‌ అనే ఐదు అంశాలపై పోటీలు నిర్వహిస్తోంది.

విజేతలకు నగదు బహుమతులు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ వివరాలను https:// sevafirst.mic.gov.in/login వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తులను 25 నుంచి రాష్ట్ర స్థాయిలో పరిశీలించి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల ప్రాజెక్టులను నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 15 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతి అంశంలో విజేతలకు భారీ నజరానాలు ప్రకటించారు. ప్రథమ బహుమతి రూ.10 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.5 లక్షలు, తృతీయ బహుమతి రూ. 3 లక్షలు అందిస్తారు.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. ఐదు విభాగాల్లో వినూత్న ఆలోచనలున్న విద్యార్థులను గుర్తించి ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి. ఎంపికై న విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు మెంటరింగ్‌, ఇంక్యుబేషన్‌ సహాయం లభిస్తుంది. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

– సిద్దిరాంరెడ్డి, జిల్లా సైన్స్‌అధికారి, కామారెడ్డి

‘సేవా ఫస్ట్‌ ఇన్నోవేషన్‌

చాలెంజ్‌–2026’కు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో

దరఖాస్తుల స్వీకరణ

జాతీయ స్థాయిలో విజేతలకు

భారీ నగదు బహుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement