అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

బోధన్‌/ కామారెడ్డి రూరల్‌/ బాన్సువాడ/ తాడ్వాయి: బోధన్‌ పట్టణంలోని బీటీనగర్‌ ప్రభత్వ ఉన్నత పాఠశాల 1999–2000కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ ఉపాధ్యాయులు పరుచూరి నగేశ్‌బాబు, గోపిచందర్‌, నరేంద్ర, పూర్వ విద్యార్థులు నీలం కుమార స్వామి, మహేందర్‌, శంకరప్ప, త్రివేణి, భాగ్యలక్ష్మి, శశికళ, లావణ్య, లలిత, రాజు, రియానంద్‌, నరేశ్‌, నాగురావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ఉన్నత పాఠశాల 2001–2002కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చదువు నేర్పిన గురువులను సన్మానించారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస టుటోరియల్‌ పాఠశాల 1996–97కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 ఏళ్ల అనంతరం అందరూ ఒకే చేరడంతో మిత్రులందరూ సంతోషం వ్యక్తం చేశారు. నాటి గురువులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్‌ సలాం, సత్యనారాయణ, పోచయ్య, పుష్పలత, శ్రీనివాస్‌రెడ్డి, సాయిరెడ్డి, విఠల్‌, నర్సింలు, సుదీర్‌ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి మిత్రులందరూ ఒకే చోట చేరడంతో ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. నాటి గురువులు హన్మంత్‌ రెడ్డి, శ్రీశైలం, సంగయ్య, విద్య, నర్సయ్య, రవి శంకర్‌, వెంకట్రావు, నరసింహులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement