బిడ్డ ప్రాణాలు కాపాడండి | - | Sakshi
Sakshi News home page

బిడ్డ ప్రాణాలు కాపాడండి

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

● వైద్యం కోసం డబ్బుల్లేక

అల్లాడుతున్న తల్లి

● ఆదుకోవాలంటూ వేడుకోలు

బాన్సువాడ: కుటుంబానికి ఆసరా ఉంటాడని తలిచిన తల్లికి కన్నీళ్లే మిగిలాయి. రోడ్డు ప్రమాదంలో ఒకగానొక కొడుకు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు బతుకుజీవుడా అనే స్థితిలో ఉన్నాడు. ఆర్థిక సాయం కోసం ఆ తల్లి తల్లడిల్లుతోంది. వివరాలిలా ఉన్నాయి. బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన రాచకొండ సాయవ్వకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు జ్ఞానేశ్వర్‌ ఉన్నారు. సాయవ్వ భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసింది. తన ఆశలన్నీ కుమారుడైన జ్ఞానేశ్వర్‌పైనే పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది. జ్ఞానేశ్వర్‌ ఓ ప్రైయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 8న ఉద్యోగ రీత్యా బైక్‌పై బరంగెడ్గి నుంచి బాన్సువాడకు వెళ్తుండగా బైరాపూర్‌ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు నిజామాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఓ ప్రైయివేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లి సాయవ్వ బోరున విలపిస్తోంది. వైద్యం కోసం ఆస్పత్రిలో రూ. 6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని, ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న రూ. 2 లక్షలు అయ్యాయని, చేతిలో చిల్లి గవ్వ లేదని సాయవ్వ వాపోయింది. దాతలు ఆదుకోవాలని ఆ తల్లి వేడుకుంటోంది. జ్ఞానేశ్వర్‌ మేనమామ సాయిలు ఫోన్‌ పే నంబర్‌ ద్వారా 7569880969 సాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement