ఈసారైనా చైర్మన్‌ పదవి దక్కేనా..? | - | Sakshi
Sakshi News home page

ఈసారైనా చైర్మన్‌ పదవి దక్కేనా..?

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

నస్రుల్లాబాద్‌ : నస్రుల్లాబాద్‌ గ్రామ ప్రాథమిక సహకారం సంఘం చైర్మన్‌ పదవి గ్రామస్తులకు ఈ సారైనా దక్కుతుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత 50 ఏళ్లలో ఇన్‌చార్జులుగా రెండు సార్లు పదవులు వచ్చాయి. ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసొసైటీ ఈపరిధిలో నస్రుల్లాబాద్‌, బొమ్మన్‌దేవ్‌ పల్లి,హాజీపూర్‌ గ్రామాలు ఉన్నాయి. 7 డైరెక్టర్ల పదవులు బొమ్మన్‌దేవ్‌పల్లిలోనే ఉండగా, నస్రుల్లాబాద్‌ లో 3,హాజీపూర్‌లో 3 డైరెక్టర్లు ఉన్నాయి. ఒక్క సారి కూడా ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో గెలుపొందలేక పోయారు. నస్రుల్లాబాద్‌ గ్రామస్తుడు 1976–78 వరకు కల్లూరి నర్సయ్య మొదటి సారి చైర్మన్‌ పదవి స్వీకరించారు. ఆ తర్వాత బొమ్మన్‌దేవ్‌ పల్లికి చెందిన వారే చైర్మన్‌లుగా గెలుపొందారు.

నామినేటెడ్‌ అదృష్టం వరించేనా...?

ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం సొసైటీ పాలకవర్గాన్ని నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో మండల కేంద్ర సొసైటీ పదవి కోసం ఇరువర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు బొమ్మన్‌దేవ్‌పల్లి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో నస్రుల్లాబాద్‌ సొసైటీ చైర్మన్‌ పదవి ఎవరికి వస్తోందనని ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement