బస్సు ఢీకొని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి కాలనీకి చెందిన రామచంద్రమూర్తి (65) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓరియంటల్‌ స్కూల్‌ వద్ద వెనుక నుంచి వచ్చిన ఎలక్ట్రిక్‌ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రామచంద్రమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ప్రభుత్వ జనరల్‌ ఆస్పతికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement