నిజాంసాగర్(జుక్కల్): ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణాలు తప్పనిసరిగా చేపట్టాలని బాన్సువాడ డీఎల్పీవో ప్రసాద్‌రావు సూచించా రు. మహమ్మద్ నగర్ మండలంలోని గాలీపూ ర్, ముగ్థుంపూర్ గ్రామాల్లో శుక్రవారం ఆయ న పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల పనులు, జీపీ కా ర్యాలయాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఇంకుడు గుంతకు రూ. 6,500, డ్రైనేజీ సోపిట్‌కు రూ. 92వేలు ఉపాధి హామి ద్వారా చెల్లిస్తుందన్నారు. సర్పంచులు కిరణ్, సుమయఅథిక్, కార్యదర్శి సాయిప్రణిత్ ఉన్నారు.
బిచ్కుంద(జుక్కల్): సమాచార హక్కుచట్టం ప్రజలకు ఆయుధం లాంటిదని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి, స.హ చట్టంపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో గోపాల్, ఆర్‌ఐ అంజు, అధికారులు, పాల్గొన్నారు.
రామారెడ్డి: మండల పరిధిలోని క న్నాపురం గ్రామ పంచాయతీ తండాలో తాగు నీటి కొరతను అధిగమించేందుకు స్థానిక పాలకవర్గం నడుం బిగించింది. చెరువు సమీపంలో ఇటీవల బోరుబావిని తవ్వించగా, నీరు పడ టంతో అక్కడి నుంచి మోటార్ ద్వారా దాదా పు ఒక కిలోమీటర్ దూరం పైప్‌లైన్ వేసి తండా కు నీటిని తరలించే పనులను వేగవంతం చేశా రు. సర్పంచు కాట్రోత్ మంగి శుక్రవారం మా ట్లాడుతూ.. పనులకు మొత్తం రూ. 2లక్షలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. నీటి సమస్య తీ రనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోవింద్‌నాయక్, రవి ఉన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: యువత చెడు వ్యసనాలు, సైబర్ మోసాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పోలీస్ కళాబృందం, దేవునిపల్లి పోలీసులు సూచించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రదర్శనలు, పాటలతో పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, షీ టీమ్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గోపాల్‌పేటలో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలోని సిద్ధార్థ వోకేషనల్ కళాశాలలో శుక్రవారం షీ టీంపై సిబ్బంది అవగాహన కల్పించారు. కళాశాలలో ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే విద్యార్థినులు వెంటనే షీ టీంను సంప్రదించాలని షీటీం కానిస్టేబుళ్లు సుప్రజ, శ్రీశైలం సూచించారు. ప్రిన్సిపాల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలో..
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవారం మేరా యువభారత్, ఎన్‌ఎస్‌ఎస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నశా ముక్త్ భారత్‌పై నిర్వహించిన నినాదాల కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి బ హుమతులను అందజేశారు. అనంతరం నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఎకై ్సజ్ సీఐ లావణ్య, ప్రిన్సిపల్ గంగాధర్, సునిల్ రాథోడ్ పాల్గొన్నారు.
ముత్యంపేటలో ఒకరి ఆత్మహత్య
దోమకొండ: మండలంలోని ముత్యంపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రబాకర్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జొన్నల తిరుపతి (54) అనే వ్యక్తి మొదటి భార్య సరస్వతి మరణాన్ని తట్టుకోలేక తరచూ బాధపడుతుండేవాడు. రెండో భార్య లక్ష్మమ్మ ఐదేళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తిరుపతి ఒంటరిగా నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.


