12 గంటల నిరంతరాయ విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

12 గంటల నిరంతరాయ విద్యుత్‌ అందించాలి

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

గాంధారి(ఎల్లారెడ్డి): వ్యవసాయానికి 12 గంటల నిరంతరాయ విద్యుత్‌ అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మండల పరిధిలోని సర్వాపూర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద గాంధారి–బాన్సువాడ ప్రధాన రహదారిపై శుక్రవారం పలు గ్రామాలకు చెందిన రైతులు ధర్నా చేశారు. లోవోల్టేజీ, అప్రకటిత కరెంట్‌ కోతలతో బోర్లు సరిగా నడవక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఏ మల్లేష్‌, ఏఈ నాగరాజు రైతులతో మాట్లాడి 12 గంటలు కరెంటు సరఫరా చేస్తా మని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పిట్లం(జుక్కల్‌): మండలంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక వరి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం మండలకేంద్రంలో వారు రైతులతో కలిసి ఎండిపోయిన పంటలను చూపిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, నాయకులు వెంకటరామిరెడ్డి ఉన్నారు.

రామారెడ్డి(ఎల్లారెడి): మండల కేంద్రంలో కరెంట్‌ కోతలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవా రం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కరెంట్‌ లేకపోవడంతో రామారెడ్డి సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. రెడ్డిపేట సబ్‌స్టేషన్‌ నుంచి సమ స్య తలెత్తినట్లు ఏఈ సుధాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement