బడుల్లో బతుకమ్మ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

బడుల్లో బతుకమ్మ సంబరాలు

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

బడుల్లో బతుకమ్మ సంబరాలు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు బడులతోపాటు, పలు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి విద్యాసంస్థలకు తరలివచ్చారు. ఆయా విద్యాసంస్థల్లో ఉదయం నుంచే విద్యార్థినులు, ఉపాధ్యాయినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం స్కూల్స్‌, కళాశాలల ప్రాంగణంలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, వాటి చుట్లూ విద్యార్థినులు, ఉపాధ్యాయినులు నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. పలువురు కోలాటాలు ఆడారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement