అటవీ భూమి ఆక్రమణ! | - | Sakshi
Sakshi News home page

అటవీ భూమి ఆక్రమణ!

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

నాగిరెడ్డిపేట: అటవీ భూమి ఆక్రమణ నేపథ్యంలో ఫారెస్ట్‌ అధికారులు ట్రాక్టర్‌ డోజర్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధి లోని పల్లెబోగుడతండా సమీపంలో సుమారు 14 ఎ కరాల అటవీభూమిని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తు లు చదును చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎఫ్‌ఆర్‌వో రమేష్‌ అటవీశాఖ సిబ్బందితోపాటు నాగిరెడ్డిపేట పోలీసులతో కలిసి శుక్రవారం తండాకు చే రుకొని అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించినదిగా పేర్కొంటూ తండాలోని ఓ ట్రాక్టర్‌ డోజర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అ టవీ భూమి ఆక్రమణతో తమకు సంబంధం లేదంటూ తండావాసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్ర మంలో ట్రాక్టర్‌కు సంబంధించిన కుటుంబంలోని ధనావత్‌ సంత్యాలీ అనే గిరిజన మహిళ పురుగులమందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి వెనుదిరిగారు.

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపిక

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఆయనను శుక్రవారం ఉపాధ్యాయులు, పీఆర్టీయూ ప్రతినిధులు సన్మానించారు.

ఆర్చరీ పోటీలకు..

దోమకొండ: మండల కేంద్రానికి చెందిన పది మంది ఆర్చరీ క్రీడాకారులు ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్‌ ఆర్చరీ పోటీల్లో పాల్గొని, ప్రతిభ కనబర్చి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారిని శుక్రవారం కామారెడ్డి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు తీగల తిరుమల్‌ గౌడ్‌ అభినందించారు. అర్చరీ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు అనిల్‌ కామినేని, సంఘం జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి ఉన్నారు.

కబడ్డీ పోటీలకు బయలుదేరిన జిల్లా జట్టు

కామారెడ్డి అర్బన్‌/కామారెడ్డి టౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈనెల 10,11,12 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ జూనియర్స్‌ బాలికలు అండర్‌–20 పోటీలకు శుక్రవారం కామారెడ్డి జిల్లా జట్టు బయలుదేరింది. కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.భాస్కర్‌, భాస్కర్‌రెడ్డి, సిహెచ్‌ రాజు, ప్రతినిధులు వారికి వీడ్కోలు పలికారు.

బడికి ప్రహరీ నిర్మించాలి

భిక్కనూరు: మండలంలోని బీటీఎస్‌ ప్రాంతంలో ఉన్న జ్యోతిబాపూలే పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో కోతులు వస్తున్నాయని, విద్యార్థినులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రిన్సిపాల్‌ రాధికకు విన్నవించారు. సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

బాన్సువాడ: రాజీమార్గంతో కేసులు పరిష్కారించుకోవచ్చని బాన్సువాడ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆగస్టులో కారు–బైక్‌ ఢీకొ న్న ఘటనలో నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రా మానికి చెందిన పురం వినోద్‌కుమార్‌, ఆయన మి త్రుడు సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురికి కాళ్లు విరిగి నడవలేని స్థితిలో ఉండడంతో క్షతగాత్రులు అంబులెన్సులో కోర్టుకు వచ్చారు. జడ్జి స్వ యంగా క్షతగాత్రుల వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల వైద్యచికిత్సలకు అ య్యే ఖర్చును కారు యజమాని భరిస్తానని అంగీకరించడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చారు. పీపీ కిషోర్‌కుమార్‌, న్యాయమూర్తులు రమాకాంత్‌, ఖలీల్‌, భూషణ్‌రెడ్డి, మోహాన్‌రెడ్డి, అజీం, లక్ష్మారెడ్డి, దత్తాత్రేయ, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

నియామకం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాజ్‌కుమార్‌ మండల ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారని ఎంపీడీవో గంగాధర్‌ తెలిపారు. ఇదివరకు ప్రత్యేకాధికారిగా కొనసాగిన ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్‌ గత నెల 30న పదవి విరమణ పొందారు. ఆయన స్థానంలో రాజ్‌కుమార్‌ను ని యమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలయానికి రూ.25వేల విరాళం

భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ ఆలయ నిర్మాణానికి భిక్కనూరు సర్పంచ్‌ బల్యాల రేఖసుధర్శన్‌ దంపతులు రూ.25,116 విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా వారిని ఆలయ కమిటీ ప్రతినిధులు సన్మానించారు. గ్రంథాలయసంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, మద్ది సూర్యకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

సంక్షిప్తం

వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు

ఫారెస్ట్‌ అధికారుల యత్నం

పురుగులమందు తాగిన

గిరిజన మహిళ

పల్లెబోగుడతండాలో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement