రాజంపేట/భిక్కనూరు: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చే యాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈమేర కు వారు శుక్రవారం రాజంపేట, భిక్కనూరు మండ ల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంత రం జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మహిళల అభ్యున్నతికి కృషి
నిజాంసాగర్(జుక్కల్): స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోం దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ మండలం గుల్లా గ్రామంలో రూ. 10 లక్షలతో మహిళా సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు.
చెత్తకుప్పల తొలగింపు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహం ఎదుట భారీగా పేరుకుపోయిన చెత్తకుప్పలను జీపీ సిబ్బంది తొలగించారు. చెత్తకుప్పలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో శుక్రవారం ‘హాస్టల్ ముందే చెత్తకుప్పలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి సంబంధిత అధికారులు స్పందించి, సిబ్బందితో చెత్తను పూర్తిగా తొలగించారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
బాల్‌గీత్‌లకు ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు హిందీలో రాసిన రెండు బాల్‌గీత్‌లను ఆహ్వానిస్తున్నట్టు హిందీ ఫోరం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఇంద్రశేఖర్, సహిందర్‌నాథ్ తెలిపా రు. పట్టణంలోని శ్రీసాందీపని కళాశాలలో శుక్రవా రం హిందీఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. చింతల లింగం, గఫూర్‌శిక్షక్, సుదర్శన్, ఇస్మాయిల్, శ్యాంకుమార్, ఆదినారాయణ, రమేష్, పోశెట్టి, గంగాకిషన్, నర్సింలు, చంద్రశేఖర్, ప్రసన్నకుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నాపత్రాల మూల్యాంకనం
బీబీపేట: మండల పరిధిలోని ఏడు ప్రభుత్వ ఉ న్నత పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్ 1 ప్రశ్నాపత్రాలను శుక్రవారం మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆ ర్ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం చే శారు. ఎంఈవో అశోక్ మాట్లాడుతూ.. మూల్యాంకన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన లో పాలను గుర్తించి, నివారణకు కృషి చేస్తామన్నారు.


