కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–20 మహిళలు, పురుషులు ఎంపికలు నిర్వహించారు. 70 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొనగా అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, వెండి,కాంస్య పతకాలతో పాటు ప్రశంసా పత్రాలను అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.జైపాల్‌రెడ్డి అందజేశారు. ఎంపికై న క్రీడాకారులు 16 మంది ఈనెల 11, 12 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు అతీకుల్లా, హన్మంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, అరుణ, సంతోష్, సంజీవ్, మహేష్, మేఘన పాల్గొన్నారు.
ఎంపికై ంది వీరే:
జి.వసంత్‌నాయక్, ఆర్.రాందాస్, డి.అనిల్‌కుమార్, జె.అర్జున్, పి.జ్ఞానేశ్వర్, బి.మహేష్, సీహెచ్.గణేష్, వి.సుధాకర్, కె.రమేష్, జి.పరుశురామ్, ఎల్.అఖిల, వై.సాయిరామ్, ఎస్.రాజశేఖర్, డి.సాయిబాబు, జి.చంద్రశేఖర్‌రెడ్డి, సి.రాంచరణ్


