‘గణతంత్ర’ వేడుకలకు సిద్ధం
● ఇందిరాగాంధీ స్టేడియంలో
ఏర్పాట్లు చేసిన అధికారులు
● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న
అదనపు కలెక్టర్ విక్టర్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు అదనపు కలెక్టర్ విక్టర్ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల పంపిణీ ఉంటాయి. అధికారులు, ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సెలవులో కలెక్టర్..
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోదరుడు మరణించడంతో ఆయన అత్యవసర సెలవుపై వెళ్లారు. ఆయన ఫిబ్రవరి 7వ తేదీ వరకు సెలవులో ఉంటారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇన్‌చార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరించనున్నారు.


