పాఠశాలకు బ్యాండ్ అందజేత
మాచారెడ్డి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని రాగుల మాధవి బ్యాండ్ కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు. పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ప్రతినిధులు.. ప్రధానోపాధ్యాయుడు వెంకటాచారికి ఆదివారం బ్యాండ్‌తో పాటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేయడానికి బహుమతులు కూడా అందజేశారు. సర్పంచ్ సంతోష్‌రెడ్డి, మనబడి పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్, ప్రతినిధులు రాజు, భిక్షపతి, ఆరిఫ్, రమేశ్‌రెడ్డి, నారాయణ, షాబుద్దీన్, దేవయ్య, స్వామి, రవి, రవియాదవ్, నరేందర్, రాజు తదితరులున్నారు.


