నక్కదాడిలో లేగదూడ మృతి
లింగంపేట: మండలంలోని అయిలాపూర్ శివారులో శనివారం రాత్రి నక్క దాడి చేసిన ఘటనలో లేగదూడ మృతి చెందినట్లు అటవీశాఖ సెక్షన్ అధికారి భాస్కర్ తెలిపారు. సెక్షన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అయిలాపూర్ సర్పంచ్ మన్నె రాజయ్య తన పశువులను గ్రామ శివారులోని పంట చేను వద్ద కట్టేశారు. ఆదివారం ఉదయం అతను వెళ్లి చూడగా ఆరు నెలల వయస్సు గల లేగదూడ మృతి చెంది ఉంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. లేగదూడకు పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. అటవీ శాఖ అధికారి వెంట ఎఫ్‌బీవో సంరీన్ తదితరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన ఎర్ర చిన్న సాయిలు పొలం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన షాదుల్లా తన ఆటోలో ఆదివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సాయిలు ఆటో పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌కు సైతం గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


