రావి ఆకుపై అంబేడ్కర్ చిత్రం
మద్నూర్(జుక్కల్): గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రానికి చెందిన కర్రెవార్ పండరి ఆదివారం రావి ఆకుపై భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రాన్ని గీసి రంగులు దిద్ది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతి సంవత్సరం గణతంత్ర , స్వాతంత్య్ర దినోత్సవాల రోజున పండరి ప్రత్యేకంగా దేశానికి సంబంధించిన ఏదో ఒకటి తయారు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తుండటంతో గ్రామస్తులు ఆయనను అభినందిస్తున్నారు.
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న మట్టిని ఆదివారం సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌తో తొలిగించారు. ఇటీవల వరి నాట్లు వేసే క్రమంలో కేజ్‌వీల్ ట్రాక్టర్లు మట్టి, బురదతో అలాగే రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీర్కూర్–బాన్సువాడ బీటీ రోడ్డు పూర్తిగా మట్టితో నిండిపోవడంతో డోజర్ సహాయంతో మట్టిని తొలగించారు. కార్యదర్శి గంగారాం, పంచాయితీ సిబ్బంది ప్రవీణ్, కృష్ణ, శివకుమార్, సాయికుమార్ తదితరులున్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి శివారులోని మల్క చెరువు ఆయకట్టు కింద తైబంది చేసిన పంట పొలాలకు ఆదివారం సాగునీరు విడుదల చేసినట్లు సర్పంచ్ కత్తుల లక్ష్మి తెలిపారు. నీటి సామర్థ్యాన్ని బట్టి తైబందీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు చెరువు నీటిని పంట పొలాలకు వరుస క్రమంలో కట్టుకోవాలని సూచించారు. రైతులు అంజయ్య, బాబు, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు.. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని ఐదు క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో ఏఈవోలు నమోదు చేసిన వివరాలను వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోని రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావని తెలిపారు.
రావి ఆకుపై అంబేడ్కర్ చిత్రం
రావి ఆకుపై అంబేడ్కర్ చిత్రం


