మున్నూరుకాపు సర్పంచులకు సన్మానం
కామారెడ్డి అర్బన్: తెలంగాణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికై న మున్నూరుకాపు సర్పంచులను ఘనంగా సన్మానించడంతో పాటు డైరీని ఆవిష్కరించారు. జిల్లా మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నర్సింలు, రాజంపేట, రామారెడ్డి, కోటాల్‌పల్లి, పోల్కంపేట, వెంకటపూర్, వెల్లుట్ల గ్రామాల కొత్త సర్పంచులు దుబ్బని శ్రీకాంత్, బండి ప్రవీణ్, ఆకుల శ్యాం, దివిటి రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


