ఆధ్యాత్మికం..
ఘనంగా రేణుక ఎల్లమ్మ పండుగ
బాన్సువాడ రూరల్: బోర్లం గ్రామ దళితవాడలో ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బాజాభజంత్రీల నడుమ బోనాలు ఊరేగింపుగా తీసుకువచ్చి ఎల్లమ్మకు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
రథసప్తమి యోగా సూర్య నమస్కారాలు
కామారెడ్డి అర్బన్: రథ సప్తమి సందర్భంగా జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున 108 సూర్య నమస్కారాల యోగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాశ నరసయ్యను అసోసియేషన్ తరపున జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డి ఘనంగా సన్మానించారు. యోగాచార్యులు గరపల్లి అంజయ్యగుప్తా, యజ్ఞప్రభారి బాస రఘుకుమార్, ప్రతినిధులు అంజయ్య, రమేష్, అనిల్‌రెడ్డి, సిద్ధాగౌడ్, గంగారెడ్డి, శ్రీలత, అరుణ, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
గోపాల్‌పేటలో.. రథసప్తమి వేడుకలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం గోపాల్‌పేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి భూమప్ప ఆధ్వర్యంలో సూర్య భగవానుడికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సూర్య భగవానుడిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి అయ్యప్ప దేవాలయం 36వ వార్షికోత్సవం(ఆలయ ప్రతిష్ఠాపన దినం) సందర్భంగా ఆదివారం శత కలశాభిషేకం, క్షీరాభిషేకం, పడిపూజ, సాయంత్రం దీపాలంకరణ, పదునెట్టాంబడి పూజ, పుష్పాభిషేకం, భజనలు, ఉంజల్‌సేవ, హరివరాసనం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న, అల్పాహార ప్రసాదాలను అందజేశారు. స్వామి అయ్యప్ప, అన్నప్రసాద, అన్నదాత సేవా సమితుల ప్రతినిధులు నస్కంటి శ్రీనివాస్, పట్నం రమేష్, గొనె శ్రీనివాస్, రాజేందర్, రఘు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడిపూజ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలోని వాసర సరస్వతి ఆలయం వద్ద ఆదివారం ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడిపూజ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణలు మార్మోగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, శివస్వాములు ప్రవీణ్‌గౌడ్, భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికం..
ఆధ్యాత్మికం..
ఆధ్యాత్మికం..


