వైభవంగా రథోత్సవం
● నీలకంఠేశ్వర ఆలయంలో
ప్రత్యేక పూజలు
● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
నిజామాబాద్ రూరల్/ మోపాల్: ఇందూరులో రథ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంతో పాటు గాజుల్‌పేట్‌లో ఉన్న చక్రంగుడి, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. నీలకంఠేశ్వరాలయంలో నిర్వహించిన రథోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. హరహర మహాదేవ.. శంభోశంకరా.. అంటూ భక్తులు ఇరువైపులా కట్టిన తాళ్లతో రథాన్ని లాగారు. తల్లిఘోరి వరకు రథయాత్ర సాగగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడు అందరికి ఆయుష్యును, ఆరోగ్యాన్ని అందించి, మూడు కాలాల్లో, ఆరు రుతువుల్లో రైతులకు అవసరమయ్యే ప్రకృతి శక్తులను అందించి ఆనందింపజేయాలని శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారని పలువురు అర్చకులు తెలిపారు. కంఠేశ్వర ఆలయంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు శివపార్వతులను దర్శించుకుని పూజలు చేశారు. నీలకంఠునికి సోమవారం చక్రతీర్ధం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుహాన్ తెలిపారు.
వైభవంగా రథోత్సవం


