అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకోసం పేర్లు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు చేపట్టిన ర్యాలీని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు సర్టిఫికెట్‌లతో పాటు అర్హులైన వారికి జారీ చేసిన ఎపిక్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూగర్భజల శాఖ ఏడీ సతీష్ యాదవ్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, వివిధ కళాశాలల అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
‘అవర్ ఓట్’ పుస్తకావిష్కరణ
కామారెడ్డి పట్టణానికి చెందిన కవి, రచయిత సిరిగాద శంకర్ రచించిన అవర్ ఓట్ పుస్తకాన్ని ఆదివారం అదనపు కలెక్టర్‌విక్టర్ ఆవిష్కరించారు. పుస్తక రచయితను అభినందించారు. కార్యక్రమంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ బల్‌రాం, కవులు, రచయితలు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో కోరారు. టైలరింగ్ (31 రోజులు, ఈనెల 29నుంచి ప్రారంభం), మగ్గం వర్క్ (31రోజులు, ఈనెల 28నుంచి), బ్యూటీపార్లర్ (35రోజులు, ఈనెల 27 నుంచి) కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణతోపాటుగా భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన టూల్స్ అందిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 19నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన తెలిపారు. ఆసక్తిగల వారు ఎస్సెస్సీ, ఆధార్‌తోపాటు బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ, ఫొటోలు తీసుకువచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తివివరాలకు 08461– 295428ను సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో పనిచేస్తున్న 104 మంది వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) మొబైల్ నంబర్లు మారాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సలహాలు, సేవల కోసం కొత్త నంబర్లకే ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కొత్త ఫోన్ నంబర్లకోసం వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి విద్యామందిర్‌లో తపస్ జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కొత్త పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, సత్యనారాయణ, నాయకులు భాస్కరాచారి, రాజశేఖర్, పవన్‌కుమార్, ఆంజనేయులు, లక్ష్మీపతి, రాజకుమార్, మధు, వేదప్రకాష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి


