విజ్ఞాన యాత్రకు బాలసదనం విద్యార్థులు
ఆలోచనా శక్తి పెరుగుతుంది
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని బాలసదనానికి చెందిన 65 మంది విద్యార్థులను అధికారులు ఒకరోజు విజ్ఞాన విహార యాత్రకు తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక చొరవ తీసుకుని యాత్రకు పంపించారు. పిల్లల్లో సృజనాత్మకత పెంచేందుకు, చరిత్ర, కళలు, సంస్కృతి, మానవ పరిణామానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియానికి తీసుకువెళ్లామని అధికారులు పేర్కొన్నారు. మ్యూజియంలోని చారిత్రక, పురాతన వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, శిల్పకళను పిల్లలు పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇలాంటి విద్యా విహారయాత్రలు పిల్లల్లో సానుకూల పరిశీలన దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా ఆలోచనా శక్తిని పెంచుతాయి. పిల్లల కోసం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపడతాం.
– ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి
విజ్ఞాన యాత్రకు బాలసదనం విద్యార్థులు


