
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ బాలుడు మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన
బాన్సువాడ: పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భాను ప్రసాద్(16) మంగళవారం రాత్రి జ్వరం రావడంతో అతడిని కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సిబ్బంది పట్టించుకోలేదని ఉదయం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాలుడిని వెంటనే తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడలోని ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవ చేసుకుని కుటుంబీకులకు నచ్చ జెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

క్రైం కార్నర్

క్రైం కార్నర్