
తెలంగాణ గర్వించదగ్గ మహాకవి సినారె
కామారెడ్డి అర్బన్: తెలంగాణ గర్విందగ్గ కవి సినారె అని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ అన్నారు. సినారె జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సినారె రచనలను కవులు, రచయితలు కొనియాడారు. కవి సమ్మేళనంలో యెంబరి లింగం, బి.నాగభూషణం, సుధాకర్, సాయిప్రభ, బాలరాజయ్య, చంద్రకాంత్, సంధ్య తదితరులు కవితా గానం చేశారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్, తెలుగు శాఖ అధ్యక్షుడు పి.విశ్వప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ..
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు. నారాయణరెడ్డి చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫేసర్ శంకర్‌లు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు.