
హమాలీలు కాదు.. ఆరోగ్య శాఖ సిబ్బందే..!
నస్రుల్లాబాద్: పై చిత్రంలో ఆటోలో నుంచి సామాను తీస్తూ కనపడుతున్న మహిళలు హమాలీ పనులకు వచ్చిన వారు కాదు.. నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిట్లం నుంచి వచ్చిన మంచాలు, బెడ్లు, కుర్చీలను ఆటో నుంచి దింపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొంత కాలం సబ్ సెంటర్ నిర్వహిస్తామనడం.. ఉన్నపలంగా సామగ్రి రావడంతో సహాయకులు ఎవ్వరూ దొరక్కపోవడంతో ఇలా వారే మోయలేని బరువులను మోస్తూ కనబడ్డారు. నూతన భవనం ప్రారంభించడం కాదని కనీసం వస్తువులు దింపడానికి కూలీలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు మరిచారని ఆరోగ్య శాఖా మహిళా సిబ్బంది తిప్పలు చూస్తున్న స్థానిక ప్రజలు అంటున్నారు.