
సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలి
ఖలీల్‌వాడి: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని నిరోధించేందుకు ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ హాల్‌లో బుధవారం సైబర్ వారియర్స్‌కి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకొని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమిషనరేట్ పరిధిలో 1 జనవరి 2024 నుంచి జూలై 29, 2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా రూ.3,27,12,397.84 కోర్టు ద్వారా బాధితులకు అందించామన్నారు. అనంతరం సైబర్ వారియర్స్‌కు టీ షర్ట్స్ అందజేశారు.