
పాఠశాలలో కంప్యూటర్లు మాయం
బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ జెడ్పీ హైస్కూల్ నుంచి నాలుగు కంప్యూటర్లు చోరీకి గురైనట్లు హెచ్‌ఎం శ్రీనివాస్ అప్పా తెలిపారు. ప్రభుత్వం 10 కంప్యూటర్లు మంజూరు చేయగా, వాటిలో ఐదింటిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఇచ్చి ఒక కంప్యూటర్‌ను కార్యాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నామన్నారు. వేసిన తాళం వేసినట్లుగా ఉందని, కంప్యూటర్లు మాత్రం కన్పించకుండా పోయాయని అన్నారు. ఈ నెల 22న చోరీ జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతోపాటు బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. కాగా, విషయాన్ని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు వారం రోజులుగా గోప్యంగా ఉంచడంపై సిబ్బందిపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.